సింహాచలంలో ధనుర్మాసం ప్రారంభం
పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు
విశాఖపట్నం – సింహాచలం లోని శ్రీ వరహలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో నెలగంట మోగించారు. ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ , ఉప ప్రధానార్చకులు సీతారామాచార్యులు ధనుర్మాస ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. స్వామి వారికి పూజలు నిర్వహించారు.
శ్రీ స్వామి వారి సన్నిధిలో తేది.31వ తేదీ నుండి వచ్చే ఏడాది 2025 జనవరి 17 వరకు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఈవో. ఇందులో భాగంగా పగల్ పత్తు ఉత్సవములు, ముక్కోటి ఏకాదశి, ధారోత్సవములు నిర్వహిస్తామన్నారు.
అంతే కాకుండా కనుమ పండుగ సందర్భముగా ప్రతి రోజు ఉదయం దేవాలయంలో శ్రీ స్వామి వారి తిరు వీధి, విశేష ఉత్సవములు నిర్వహించనున్నట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి వి. త్రినాథరావు స్పష్టం చేశారు.