ధరణి స్పెషల్ డ్రైవ్ సక్సెస్
కీలక మార్పులు చేసిన సర్కార్
హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా కొలువు తీరిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ధరణిపై పెద్ద ఎత్తున విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ధరణి పేరుతో గత సర్కార్ ప్రభుత్వ భూములను కాజేసిందని, తమ వారికి భారీ ఎత్తున కట్ట బెట్టిందంటూ ఆరోపించారు. ఇదే విషయం ప్రధానంగా మారింది కూడా.
ధరణి రైతుల పాలిట శాపంగా మారిందని వాపోయారు పలువురు బాధితులు సైతం. తమకు చెందిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని, గులాబీ దండు మోసం చేశారంటూ వాపోయారు. కోర్టుల్లో పలు కేసులు కూడా నమోదయ్యాయి.
తాజాగా కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ధరణిలో కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా ఎల్ఆర్ఎస్ ను పునరుద్దరించింది. ధరణి ప్రక్షాళన ప్రారంభించింది. కేవలం 4 రోజుల్లో ఏకంగా 30000 వేల దరఖాస్తులు అందాయి. వీటి పరిష్కారానికి మోక్షం లభించింది.
గతంలో అధికారులు ఏమైనా సమస్యలు ఉంటే స్పందించే వారు కారు. సీన్ మారడంతో వారే దగ్గరుండి ఫోన్లు చేసి వివరాలు తెలుసు కుంటుండడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల దరఖాస్తులు అందినట్లు సమాచారం ధరణిలో పరిష్కారం కోసం.