బహుజనులకే జగన్ పెద్దపీట
మంత్రి ధర్మాన ప్రసాదరావు
అమరావతి – ఏపీలో జరగబోయే శాసన సభ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇప్పటికే జగన్ ఖరారు చేశారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు స్పష్టం చేశారు . శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ పరంగా 175 స్థానాలు , పార్లమెంట్ పరంగా 25 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను సీఎం ఇప్పటికే ఎంపిక చేశారని, ఇవాళ ఎవరెవరు బరిలో ఉంటారనే దానిపై క్లారిటీ ఇస్తారని స్పష్టం చేశారు. మొత్తం 175 స్థానాలతో పాటు 25 ఎంపీ స్థానాలకు క్యాండిడేట్స్ ను ప్రకటించేందుకు రెడీగా ఉన్నారని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా మొత్తం అభ్యర్థుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీలకు సీట్లను కేటాయించనున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక బహుజనులకే పెద్దపీట వేయడం జరిగిందని స్పష్టం చేశారు ధర్మాన ప్రసాదరావు.
ఇప్పటి వరకు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలలో 100కు పైగా వీరికే అప్పగించేందుకు సిద్దమయ్యారని తెలిపారు. రాజ్యాధికారంతోనే సామాజిక మార్పు వస్తుందని జగన్ రెడ్డి బలంగా నమ్మారని అన్నారు.