ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
గుండె పోటుతో మృతి చెందడంతో విషాదం
హైదరాబాద్ – కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ కన్ను మూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గుండె పోటుతో మృతి చెందిన ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఉమ్మడి ఏపీలో, తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన భూమిక పోషించారు డి. శ్రీనివాస్. ఆయన అనేకమైన పదవులు నిర్వహించారు. డి. శ్రీనివాస్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా. ఆయన తనయుడు ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆయనే ధర్మపురి అరవింద్.
సెప్టెంబర్ 27, 1948లో పుట్టారు. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. రాజకీయాల్లోకి వచ్చి కీలకమైన పదవులు ఎన్నో చేపట్టారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగి నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 199,2004లో శాసన మండలి సభ్యుడిగా గెలుపొందారు. 1998లో ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా ఉన్నారు.
2004, 2009లో డీ శ్రీనివాస్ మంత్రిగా సేవలు అందించారు. రాష్ట్రం విభజన అనంతరం 2015లో బీఆర్ఎస్ లో చేరారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఆయనకు ఇద్దరు కొడుకులు ఒకరు ఎంపీ మరొకరు మాజీ మేయర్. ఆయన మృతి పట్ల వివిధ పార్టీలకు చెందన నాయకులు సంతాపం తెలిపారు.