ధ్రువ్ జురైల్ ఒంటరి పోరాటం
రాజస్థాన్ కు తప్పని పరాజయం
చెన్నై – ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన ఐపీఎల్ 17వ సీజన్ లో 2వ క్వాలిఫయర్ మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓడించి నేరుగా ఫైనల్ కు చేరింది.
కేరళ స్టార్ సంజూ శాంసన్ ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ బౌలర్ల దెబ్బకు ఆదిలోనే ఇబ్బందులు పడింది హైదరాబాద్. ఈ సమయంలో జట్టును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు స్టార్ క్రికెటర్లు క్లాసెన్ తో పాటు త్రిపాఠి.
నిర్ణీత 20 ఓవర్లలో 176 రన్స్ చేసింది. క్లాసెన్ తో పాటు రాహుల్ త్రిపాఠి అద్భుతంగా ఆడారు. జట్టు స్కోర్ పెరిగేందుకు దోహద పడ్డారు. అనంతరం టార్గెట్ ఛేదన కోసం మైదానంలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఏ కోశాన పోటీ ఇవ్వలేక పోయింది.
జట్టులో ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఎక్కడా తడబాటుకు లోను కాకుండా ధ్రువ్ జురైల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 35 బంతులు ఎదుర్కొని 56 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. ఇందులో 7 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి.
ఇక హైదరాబాద్ బౌలర్లు షాబాజ్ అహ్మద్ 23 రన్స్ ఇచ్చి 3 వికెట్లు కూల్చితే అభిషేక్ శర్మ 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది.