NEWSNATIONAL

నా ఛాన‌ల్ పై త్వ‌ర‌లోనే నిషేధం

Share it with your family & friends

యూట్యూబ‌ర్ ధృవ్ రాఠీ కామెంట్స్

న్యూఢిల్లీ – ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ ధృవ్ రాథీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌త కొన్ని రోజులుగా ప్ర‌ధాన మంత్రి మోదీని, కేంద్ర స‌ర్కార్ ను, భార‌తీయ జ‌న‌తా పార్టీని, దాని అనుబంధ సంస్థ‌ల‌ను, అధికారం పేరుతో సాగిస్తున్న అన్యాయాలు, అక్ర‌మాలను బ‌ట్ట బ‌య‌లు చేస్తున్నాడు. అంతే కాదు కులం పేరుతో, మ‌తం పేరుతో, కాషాయ జెండా ఎలా ఎగ‌ర వేయాల‌ని అనుకుంటున్నారో కూడా కుండ బ‌ద్ద‌లు కొడుతున్నారు.

దీంతో ఒక్క‌సారిగా యావ‌త్ ప్ర‌పంచం ధృవ్ రాఠీ సెన్సేష‌న్ గా మారి పోయారు. మిలియ‌న్ల కొద్దీ ఆయ‌న‌ను అనుస‌రిస్తున్నారు. ఆయ‌న ఆలోచ‌న‌ల‌తో ఏకీభ‌విస్తున్నారు. ఈ దేశంలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను మ్యానేజ్ చేస్తూ వ‌స్తున్న మోదీకి, ఆయ‌న ప‌రివారానికి ఇప్పుడు ధృవ్ రాఠీ కంట‌గింపుగా మారాడు. ఆయ‌న‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్నాయి బీజేపీ శ్రేణులు.

ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ క‌ర‌ణ్ థాప‌ర్ ప్ర‌త్యేకంగా ధృవ్ రాఠీతో సంభాషించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. వైర‌ల్ గా మారింది. లక్ష‌లాది మంది ధృవ్ రాఠీని చూస్తున్నారు. త‌మ స్పంద‌న‌ను తెలియ చేస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు దృవ్ రాఠీ. త్వ‌ర‌లోనే కేంద్ర స‌ర్కార్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్ ను నిషేధించ‌నుంద‌ని అన్నారు. త‌న ఛాన‌ల్ ను ఆపేయ‌గ‌ల‌రు లేదా నిలిపి వేయ‌గ‌ల‌రు..కానీ త‌నను నిర్మూలించ లేర‌ని స్ప‌ష్టం చేశారు. మోదీ వ‌చ్చాక మీడియాకు ముకుతాడు వేశార‌ని ఆరోపించారు.

దేశాన్ని కాపాడుకునేందుకు ఓటు వేయాల‌ని పిలుపునిచ్చాడు. అది ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. భ‌విష్య‌త్తులో ఏ పార్టీ అయినా బీజేపీ లాగా ప‌ని చేస్తే తాను వ్య‌తిరేకిస్తూనే ఉంటాన‌ని, త‌న వాయిస్ వినిపిస్తూనే ఉంటాన‌ని ప్ర‌క‌టించారు రాఠీ. ఈడీ చ‌ర్య‌లు మోదీ అభ‌ద్ర‌త‌, పిరికిత‌నాన్ని చూపిస్తున్నాయంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.