DEVOTIONAL

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి ఉత్స‌వాలు ప్రారంభం

Share it with your family & friends

ధ్వ‌జారోహ‌ణంతో వైభ‌వోపేతంగా

తిరుప‌తి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలకు గురువారం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు.

ఉదయం అమ్మ వారికి సుప్రభాత సేవ, సహస్ర నామార్చన, నిత్య అర్చన జరిపారు. అనంతరం ఉదయం 6.30 గంటలకు నాలుగు మాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరిపి, ధ్వజ స్థంభ తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు.

టీటీడీ ఈవో శ జె. శ్యామల రావు దంపతులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో గోవింద రాజన్, పాంచరాత్ర ఆగమ సలహాదారు మణికంఠ స్వామి, కంకణ భట్టార్ శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అనంతరం ఈవో జె.శ్యామలరావు శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన, శిల్ప కళాశాల లో ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు.