DEVOTIONAL

రేపే డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

Share it with your family & friends

భ‌క్తుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌తి నెలా నిర్వ‌హించే డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం సెప్టెంబ‌ర్ 6వ తేదీన శుక్ర‌వారం నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఈ కార్య‌క్ర‌మం మధ్యాహ్నం 2 నుండి 2.50 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుందని తెలిపింది టాటీడీ. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంద‌ని తెలిపింది. .

ఈ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి ఈవో జె.శ్యామలరావు గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుప వ‌చ్చ‌ని వెల్ల‌డించింది టీటీడీ.

ఇందుకు గాను భ‌క్తులు డ‌య‌ర్ యువ‌ర్ కార్య‌క్ర‌మానికి సంబంధించిన‌ 0877-2263261 అనే నెంబ‌ర్ కు ఫోన్ చేయాల‌ని సూచించింది . తిరుమ‌ల ప‌విత్ర‌మైన పుణ్య క్షేత్రానికి సంబంధించి ఎలాంటి ప్ర‌శ్న‌లైనా ఈవోను అడ‌గ‌వ‌చ్చ‌ని తెలిపింది టీటీడీ.

ఒక వేళ ద‌ర్శ‌నానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉన్న‌ట్ల‌యితే తెలియ చేయాల‌ని సూచించింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం.