NEWSNATIONAL

బెంగాల్ లో లా అండ్ ఆర్డ‌ర్ విఫ‌లం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి న‌డ్డా

ఢిల్లీ – కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి , బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ప‌శ్చిమ బెంగాల్ టీఎంసీ ప్రభుత్వంపై విరుచుకు ప‌డ్డారు. కోల్ క‌తా లో చోటు చేసుకున్న డాక్ట‌ర్ అత్యాచార‌, హ‌త్యా ఘ‌ట‌న విష‌యంలో పూర్తిగా వైఫ‌ల్యం చెందారంటూ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై నిప్పులు చెరిగారు.

అప్ర‌జాస్వామికంగా పాల‌న సాగిస్తున్నారంటూ ఆరోపించారు జేపీ న‌డ్డా. గ‌త కొంత కాలంగా శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగినా ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. వెంట‌నే మ‌మతా బెన‌ర్జీ త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని జేపీ న‌డ్డా డిమాండ్ చేశారు. నైతిక బాధ్య‌త వ‌హించి త‌ప్పుకుంటే మంచిద‌న్నారు.

ఆమె వ‌ల్ల పాల‌న చేత కావ‌డం లేద‌న్నారు. లేదంటే వేరే వారికి ఇస్తే బావుంటుంద‌ని సూచించారు. ఘ‌ట‌న జ‌రిగినా ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించారు జేపీ న‌డ్డా. ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం పూర్తిగా మ‌హిళ‌ల‌కు , ప్ర‌జాస్వామ్యానికి వ్య‌తిరేక‌మ‌ని పేర్కొన్నారు. ఇక ప్ర‌జ‌లు దీదీని స‌హించే ప‌రిస్థితిలో లేర‌న్నారు .