తన స్థాయిని మరిచి పోతే ఎలా అని ఫైర్
హైదరాబాద్ – ప్రముఖ సినీ నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ సినీ ఇండస్ట్రీ గురించి, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం గురించి చేసిన కామెంట్స్ సత్య దూరమన్నారు. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటు మాటున జరిగిన వ్యవహారం కాదన్నారు. సినీ అభివృద్ది కోసమే జరిగిందని చెప్పారు. కేటీఆర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు.
సినీ రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. వ్యక్తిగత రాజకీయాలను పక్కన పెట్టాలని స్పష్టం చేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది నటుడు అల్లు అర్జున్ వ్యవహారం. పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చని పోయింది. తన కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు కిమ్స్ ఆస్పత్రిలో.
బన్నీపై, సినీ ఇండస్ట్రీపై సీరియస్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఒకానొక దశలో మొత్తం తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఏపీకి తరలి పోతుందనే ప్రచారం జరిగింది. పరిస్థితిని చక్క దిద్దేందుకు రంగంలోకి దిగారు నిర్మాత దిల్ రాజు.