ఎఫ్డీసీ చైర్మన్ గా దిల్ రాజు
కొలువు తీరిన నిర్మాత
హైదరాబాద్ – ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు కీలక పదవి దక్కింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆయన పూర్తి పేరు వెంకట రమణా రెడ్డి. ఆ తర్వాత దిల్ రాజుగా మార్చుకున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రశ్రేణి నిర్మాతగా కొనసాగుతూ వస్తున్నారు.
తాజాగా తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి ఉండడంతో ఆయన సామాజిక వర్గానికి కీలకమైన పదవులు లభిస్తూ వస్తున్నాయి. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనా పట్టించు కోలేదు.
తీరా తెలంగాణ ఫిల్మ్ డెవలపమ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు (రెడ్డి)కు ఛాన్స్ ఇచ్చింది. ఆయన తన పుట్టిన రోజు సందర్బంగా ఎఫ్డీసీ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఇతరులు పాల్గొన్నారు.
దిల్ రాజు గతంలో తెలుగు ఫిలిం ఛాంబర్‌కి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవలే తన పదవీ కాలం పూర్తయింది. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ ను నిర్మించారు. ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 21న అమెరికాలో జరగనుంది.