NEWSNATIONAL

బీజేపీతో ఏఎంకే పొత్తుకు రెడీ

Share it with your family & friends

అన్నామ‌లైతో దిన‌క‌ర‌న్ భేటీ

చెన్నై – తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ కుమార్, రాధిక క‌లిసి త‌మ పార్టీని భార‌తీయ జ‌న‌తా పార్టీలో విలీనం చేశారు. బుధ‌వారం ఏఎంకే సీనియ‌ర్ నాయ‌కుడు టీటీవీ దిన‌క‌ర‌న్ ఉన్న‌ట్టుండి మ‌న‌సు మార్చుకున్నారు. ఆయ‌న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కె. అన్నామ‌లై తో భేటీ కావ‌డం ప్రాధాన్యంత సంత‌రించుకుంది.

లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీకి రెండు పార్టీలు ప‌ర‌స్ప‌రం అంగీకారానికి వ‌చ్చాయి. శశికళ సూచనతో బీజేపీతో కలిసి నడవడానికి నేతలు సిద్ద‌మ‌య్యారు. మాజీ సీఎం పన్నీరు సేల్వంతో చర్చలు జరిపారు అన్నామ‌లై. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం బీజేపీ కూటమిలో చేరినట్లు నిన్న ప్రకటించారు. దీంతో అన్నామలై, డీటీవీ దినకరన్ రాత్రి వరకు చర్చలు జరిపారు.

బీజేపీ తరపున కేంద్ర మంత్రులు వీకే సింగ్, కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామ‌లై దినకరన్ లతో చర్చలు జరిపారు. సమావేశం అనంతరం ఏఎంయూ పార్టీ ప్రధాన కార్యదర్శి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో డీఎంకేను ఓడించ‌డ‌మే త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు.