దినేష్ కార్తీక్ కెవ్వు కేక
ఎస్ఆర్ హెచ్ బౌలర్లకు షాక్
బెంగళూరు – ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో అరుదైన రికార్డు నమోదైంది. పరుగుల వరద పారింది. ఒకరిని మించి మరొకరు బ్యాటర్లు శివాలెత్తారు. ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఏకంగా ఇరు జట్ల బ్యాటర్లు 38 సిక్సర్లు, 43 ఫోర్లు కొట్టారు. ఇది కూడా ఓ రికార్డే.
ముందుగా బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 287 రన్స్ చేసింది. ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కితే డుప్లెసిస్ చెలరేగాడు. అనంతరం భారీ స్కోర్ ను ఛేదించే క్రమంలో బరిలోకి దిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.
కేవలం 25 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. విరాట్ కోహ్లీ , క్లాసెస్ క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడితే మైదానంలోకి వచ్చినప్పటి నుంచి అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు దినేష్ కార్తీక్. వయసు మీద పడినా తనలో ఇంకా సత్తా ఉందని చాటాడు. మైదానం నలువైపులా షాట్స్ కొట్టాడు.
ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి 262 రన్స్ చేసింది. దినేష్ కార్తీక్ 35 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 7 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. 83 రన్స్ చేశాడు. డుప్లెసిస్ 28 బంతుల్లో 62 కొట్టాడు. ఇందులో 7 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ 20 బంతుల్లో 42 రన్స్ చేశాడు. 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.