ఐపీఎల్ కు దినేశ్ కార్తీక్ గుడ్ బై
క్రికెటర్ సంచలన నిర్ణయం
బెంగళూరు – ప్రముఖ క్రికెటర్ , ఆర్సీబీలో ప్రస్తుతం వికెట్ కీపర్ గా కీలక ఆటగాడిగా పేరు పొందిన దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం కీలక ప్రకటన చేశాడు. ఐపీఎల్ కెరీర్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇక ఆడలేనంటూ పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఊహించని రీతిలో ప్రతిభ కనబర్చింది. ఏకంగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. చివరి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో ఆడాడు. అందరూ ఆర్సీబీ ఫైనల్ కు చేరుకుంటుందని, కప్ గెలుచు కోవాలని లక్ష్యంగా పెట్టుకుంది జట్టు.
ఇదిలా ఉండగా ఐపీఎల్ కెరీర్ లో దినేశ్ కార్తీక్ మొత్తం 257 మ్యాచ్ లు ఇప్పటి దాకా ఆడాడు. మొత్తం 4,842 రన్స్ చేశాడు. చాలా మ్యాచ్ లలో ఒంటి చేత్లో గెలిపించాడు. వికెట్ కీపర్ గా రాణించాడు. తనదైన ముద్ర కనబర్చాడు.
విరాట్ కోహ్లీతో పాటు తను కూడా అద్భుతంగా ఆడాడు. సూపర్ షో ప్రదర్శించాడు. తనదైన ముద్ర కనబర్చాడు.