రాడిసన్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్
ఆయన పేరు కూడా చేర్చిన ఖాకీలు
హైదరాబాద్ – రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొత్తం 10 మంది ఉన్నట్లు తెలిపిన పోలీసులు..వారిలో ఒకరు డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నట్లు చెప్పడం విస్తు పోయేలా చేసింది. క్రియేటివిటీ కలిగిన దర్శకుడిగా ఆయన గుర్తింపు పొందారు.
క్రిష్ పేరును కూడా చేర్చినట్లు చెప్పడంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో కలవరం మొదలైంది. ఈ మేరకు ఆయన కూడా పార్టీలో ఉన్నట్లు నిర్ధారించారు. పోలీసుల విచారణలో దిమ్మ తిరిగే వాస్తవాలు బయల పడినట్లు సమాచారం.
పార్టీ జరిగిన సమయంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కొడుకు వివేకానంద తో పాటు డైరెక్టర్ కూడా ఉన్నట్లు తేలింది. వివేక్ నిర్వహించిన పలు పార్టీలకు క్రిష్ కూడా హాజరైనట్లు తేల్చారు. మరికొందరి సినీ సెలబ్రిటీలపై కూడా ఆరా తీస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
ఈ కేసులో మొత్తం 10 మందిని చేర్చారు. వీరిలో నిర్భయ్ , కేదార్, రఘు చరణ్ , సందీప్ , శ్వేత, లిషి, నీల్ , క్రిష్ లతో కలిపి పార్టీ చేసుకున్నారని తెలిపారు. అబ్బాస్ జఫ్రీ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.