రాడిసన్ కు వెళ్లింది నిజమే – క్రిష్
అక్కడే వివేకానంద పరిచయం
హైదరాబాద్ – సైబరాబాద్ సీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలి లోని రాడిసన్ బ్లూ హోటల్ , పబ్ లో అడ్డంగా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. వారిలో మొత్తం 10 మంది దాకా ఉన్నారు. ఇందులో భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత కొడుకు మంజీరా కంపెనీ ఎండీ వివేకానంద ఉండడం విశేషం. ఆయనతో పాటు మోడల్ లిషి గణేశ్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
వీరి విచారణలో సంచలన అంశాలు వెలుగు చూశాయి. ఈ డ్రగ్స్ కేసులో ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి క్రిష్ ) కూడా ఉండడం విస్తు పోయేలా చేసింది. ఆయనపై కూడా కేసు నమోదు చేసినట్లు సీపీ మహంతి వెల్లడించారు.
తన ప్రమేయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో గత్యంతరం లేక స్పందించారు దర్శకుడు. తాను హోటల్ కు వెళ్లింది నిజమేనని ఒప్పుకున్నాడు. అయితే సాయంత్రం అర గంట పాటు మాత్రమే ఉన్నానని, కేవలం ఫ్రెండ్స్ ను కలిసేందుకు వెళ్లానని తెలిపాడు క్రిష్.
సరిగ్గా 6.45 గంటలకు రాడిసన్ నుంచి బయటకు వచ్చేశానని, అప్పుడే హోటల్ యజమానితో పరిచయం ఏర్పడిందన్నారు. తన డ్రైవర్ లేక పోవడంతో అతడితో మాట్లాడుతూ కూర్చున్నానని, అతడు రాగానే వెళ్లి పోయానని తెలిపారు. దీనిపై పోలీసులకు చెప్పానని, వారు తనతో వాంగ్మూలం తీసుకున్నారని అన్నారు క్రిష్. ఈ డ్రగ్స్ వ్యవహారంతో తనకేం సంబంధం లేదని స్పష్టం చేశాడు.