ENTERTAINMENT

డాక్ట‌ర్ తో డైరెక్ట‌ర్ రెండో పెళ్లి

Share it with your family & friends

16న హైద‌రాబాద్ లో రిసెప్ష‌న్

హైద‌రాబాద్ – తెలుగు సినీ రంగంలో విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. రెండో పెళ్లి అనేది స‌ర్వ సాధార‌ణంగా మారి పోయింది. సినిమాల‌లో లాగే నిజ జీవితంలో కూడా జీవించేస్తున్నారు. మొన్న‌టికి మొన్న నాగ చైత‌న్య సమంత‌కు విడాకులు ఇచ్చేశాక శోభిత ధూళిపాల‌ను పెళ్లి చేసుకున్నారు. తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ రెండో పెళ్లి చేసుకుని అంద‌రినీ విస్తు పోయేలా చేశారు.

హైదరాబాద్‌లో జరిగిన ప్రైవేట్ వేడుకలో వృత్తి రీత్యా డాక్ట‌ర్ అయిన ప్రీతి చల్లాను వివాహం చేసుకున్నారు. ఆయ‌న 2018లో ర‌మ్య‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్య ఏమైందో ఏమో కానీ విడాకులు తీసుకున్నారు.

కేవ‌లం కొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకోవ‌డం విశేషం. ఇక ప్రీతి చ‌ల్లా వైద్య రంగంలో స్థిర‌ప‌డ్డారు. చాలా కాలంగా వీరిద్ద‌రూ రిలేష‌న్ షిప్ లో ఉన్న‌ట్లు స‌మాచారం. చివ‌ర‌కు ఈ విష‌యం అంద‌రికీ తెలిసే స‌రికి పెళ్లికి సిద్ద‌మైన‌ట్లు టాక్.

విచిత్రం ఏమిటంటే డైరెక్ట‌ర్ క్రిష్, డాక్ట‌ర్ ప్రీతి ఇద్ద‌రూ ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వారు . ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు తీస్తున్నాడు. అనుష్క శెట్టితో ఘాటీ చిత్రం నిర్మాణంలో ఉంది.