ఆమె నటన అంటే నాకు చాలా ఇష్టం
తమిళనాడు – భారత దేశం గర్వించ దగిన దిగ్గజ దర్శకులలో ఒకరు మణిరత్నం. చాలా మంది సినిమా రంగానికి చెందిన నటీ నటులు ఆయన సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలని అనుకుంటారు. కోటి దేవుళ్లకు దండం పెట్టుకుంటారు. పూజలు కూడా చేస్తారు.
ఎందుకంటే ఆయన సినిమాలు అరుదుగా చేస్తారు. కానీ వాటికి ప్రాణం పోస్తారు. ఏది చేసినా అందులో జీవం ఉట్టి పడేలా ఉండేలా జాగ్రత్త పడతారు. తమ కెరీర్ లో ఒక్క సినిమా లేదా ఏదైనా పాత్ర ఉండాలని కోరుకునే వారు కోకొల్లలు.
అలాంటి దర్శకుడు ఏకంగా ఓ నటి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ రంగాన్ని కుదిపి వేస్తున్నాయి. ఆ నటి ఎవరో కాదు నేచరుల్ స్టార్ గా గుర్తింపు పొందిన సాయి పల్లవి.
భారత దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలు కోల్పోయిన , వీర మరణం చెందిన సైనికుల గురించి తమిళ సినీ దర్శకుడు అమరన్ పేరుతో సినిమా తీశాడు. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచింగ్ కార్యక్రమంలో దర్శకుడు మణి రత్నం పాల్గొన్నాడు. ఇందులో సాయి పల్లవితో పాటు శివ కార్తికేయన్ నటించారు.
తనకు సాయి పల్లవి నటన అంటే చాలా ఇష్టమని, తనతో ఒక సినిమా చేస్తానని ప్రకటించాడు. దీంతో తెగ ఆశ్చర్యానికి లోనైంది నటి సాయి పల్లవి.