ENTERTAINMENT

వ‌ర‌ద బాధితుల కోసం ద‌ర్శ‌కుడి విరాళం

Share it with your family & friends

అభినందించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి – ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు యువ దర్శకుడు వెంకీ అట్లూరి.

ఇదే స‌మ‌యంలో ప‌లువురు సినీ న‌టులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు త‌మ వంతుగా సాయం ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రూ. 6 కోట్లు ప్ర‌క‌టించారు. మ‌హేష్ బాబు, నంద‌మూరి బాల‌కృష్ణ‌, రామ్ చ‌ర‌ణ్, మెగాస్టార్ చిరంజీవి, జూనియ‌ర్ ఎన్టీఆర్ రూ. ఒక కోటి చొప్పున విరాళం ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

వీరితో పాటు జొన్న‌ల‌గ‌డ్డ సిద్దూ, విశ్వ‌క్ సేన్, అన‌న్య నాగ‌ళ్ల సైతం త‌మ వంతు సాయం ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా మాట‌ల మాంత్రికుడు , దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ సైతం స్పందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు చెరో రూ. 25 ల‌క్ష‌ల చొప్పున రూ. 50 ల‌క్ష‌లు విరాళాన్ని ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ప్ర‌ముఖ నిర్మాత సి. అశ్వ‌నీ ద‌త్ సైతం స్పందించారు. ఆయ‌న సీఎం చంద్ర‌బాబు నాయుడుకు రూ. 25 ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు. మ‌రో వైపు ఆయా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, కార్పొరేట్ కంపెనీలు , సీఈవోలు, చైర్మ‌న్ లు, ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధులు స్పందిస్తున్నారు. త‌మ‌కు తోచిన రీతిలో సాయం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మాన‌వ‌తా దృక్ఫ‌థంతో ముందుకు వ‌చ్చి విరాళాలు అంద‌జేస్తున్న వారంద‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలిపారు సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ .