ఆదేశించిన ఏపీ లోకాయుక్త చైర్మన్
అమరావతి – ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 55 మంది ప్రభుత్వ డాక్టర్లను తొలగించింది. ఎలాంటి అనుమతులు , సెలవు లేకుండా ఏడాదికి పైగా డాక్టర్లు విధులకు గైర్హాజరైనట్లు ఫిర్యాదులు వచ్చాయి. డ్యూటీలకు ఎగనామం పెట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోకాయుక్తను ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన లోకాయుక్త వైద్యులను తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం వైద్యులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా లోకాయుక్త చైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగం అనేది బాధ్యతతో కూడుకుని ఉన్నదని, అది గమనించకుండా బాధ్యతా రాహిత్యంతో విధులకు హాజరు కాక పోవడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు.
సమాజంలో అత్యంత కీలకమైన పదవి వైద్య వృత్తి అని. దాని పట్ల ఎలాంటి గౌరవం లేకుండా ఉండడం పద్దతి కాదన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వక పోవడం, ఏడాది పాటు ఎలాంటి విధులు నిర్వహించక పోవడం పూర్తిగా రూల్స్ కు విరుద్దమేనని స్పష్టం చేసింది. వీరి వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి కూడా ఏర్పడుతుందని , అందువల్ల తొలగించడమే ఉత్తమమని అభిప్రాయ పడింది.