NEWSANDHRA PRADESH

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం

Share it with your family & friends

మంత్రి లోకేష్ కు రూ.5 కోట్ల చెక్కు అందజేత

అమరావతి: కృష్ణా నదికి కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న బాధితులను ఆదుకునేందుకు దివీస్ సంస్థ భారీ విరాళంతో ముందుకు వచ్చింది.

దివీస్ సిఈఓ దివి కిరణ్ ఆదివారం హైదరాబాదులో మంత్రి నారా లోకేష్ ను కలిసి ఐదు కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. ఈనెల 1 నుంచి 8వ వరకు వరద బాధితులకు ఆహారాన్ని అంద జేసేందుకు గాను అక్షయపాత్ర ఫౌండేషన్ కు మరో రూ. 4.8 కోట్లను దివీస్ సంస్థ అందజేసింది.

మొత్తంగా రాష్ట్రంలో వరద బాధితుల కోసం 9.8 కోట్ల రూపాయల విరాళాన్ని అందించిన దివీస్ సంస్థను మంత్రి నారా లోకేష్ అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా సీఎం పిలుపుతో భారీ ఎత్తున దాత‌లు త‌మ ఔదార్యాన్ని చాటుకున్నారు. త‌మ వంతుగా సాయం చేస్తున్నారు. ఇప్ప‌టికే వివిధ రంగాల‌కు చెందిన దాత‌లు విరాళాలు అంద‌జేశారు. త‌మ స్పూర్తిని చాటుకున్నారు.

మ‌రో వైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం సాయం చేయాల‌ని వేడుకుంటున్నారు. త‌మ‌కు ఎంత తోస్తే అంత ఇవ్వాల‌ని కోరుతున్నారు.