అనంతపురం జిల్లాలో ఘటన
అమరావతి – దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు దగ్దం అయ్యింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ వద్ద 11కేవి విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తెగి పోయి బస్సు మీద పడడంతో పూర్తిగా కాలి పోయింది.
మంటలు ఎగసి పడడంతో చుట్టు పక్కల జనం భయభ్రాంతులకు లోనయ్యారు. ఇళ్లలోంచి పరుగులు తీశారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.
ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం విద్యుత్ సరఫరాను పునరుద్దరించే పనిలో పడ్డారు విద్యుత్ సిబ్బంది.
విద్యుత్ తీగలు గనుక ఇళ్ల మీద పడి ఉంటే పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించి ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతుండడంతో విస్మయానికి గురయ్యారు.