NEWSNATIONAL

ఆల‌యాల ఆధునీక‌ర‌ణ‌..ఉపాధి క‌ల్ప‌న‌

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన మంత్రి దియా కుమారి

రాజ‌స్థాన్ – రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి దియా కుమారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌స్థాన్ ను మ‌రింత తీర్చి దిద్దేందుకు గాను నిధులు మంజూరు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో పేరు పొందిన ఖ‌తు శ్యామ్ ఆల‌యంతో పాటు మ‌రో 20 దేవాల‌యాల ఆధునీక‌ర‌ణ‌కు నిధులు మంజూరు చేస్తామ‌న్నారు.

సుంద‌రీక‌ర‌ణ వ‌ల్ల ప‌ర్యాట‌క రంగం మ‌రింత అభివృద్ది చెందుతుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు దియా కుమారి. అంతే కాకుండా రాబోయే ఐదు సంవ‌త్స‌రాల కాలంలో 4 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని, అంతే కాకుండా 10 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను ప్రైవేట్ రంగంలో ఉపాధి క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.

ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రోడ్ల కోసం రూ.3 కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు. జైసల్మేర్‌లోని సోలార్ పార్క్ ను అభివృద్ది చేస్తామ‌న్నారు. ఎడారి రాష్ట్రంలో ప్రజలకు పంపు నీటిని అందించడంపై దృష్టి పెట్లాల‌ని సూచించారు దియా కుమారి.

పాఠశాలలకు వెళ్లే వారికి ఉచిత ట్యాబ్లెట్లు పిల్లల హృదయాలను గెలుచుకున్నాయి. రాష్ట్రంలో 9 మెగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, స్పోర్ట్స్ కాలేజీలు నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు.