NEWSTELANGANA

రేవంత్ న‌న్ను తొక్కేంత ద‌మ్ముందా

Share it with your family & friends

నిప్పులు చెరిగిన డీకే అరుణ రెడ్డి

పాల‌మూరు జిల్లా – బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి, ఆ పార్టీ జాతీయ నాయ‌కురాలు డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు. శ‌నివారం డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సంస్కారం లేకుండా నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడ‌ట‌మేనా అని మండిప‌డ్డారు.

త‌న‌పై నిన్న జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌న‌ను పండ బెట్టి తొక్కి పారేస్తానంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌ల‌క‌డంపై భ‌గ్గుమ‌న్నారు డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి. అంత మొగోడివా నువ్వు అంటూ ఫైర్ అయ్యారు.

పార్ల‌మెంట్ సీటు గెలిపిస్తావా నువ్వు ..రా ఏడికి వ‌స్త‌వో నేనూ చూస్తా అని స‌వాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ నేత‌లు, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట‌ల‌పై మ‌హిళ‌లు రియాక్ట్ కావాల‌ని అన్నారు. వారికి ఓట్ల‌తో త‌గిన రీతిలో బుద్ది చెప్పాల‌ని అన్నారు డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి.