సీఎంకు షాక్ జేజేమ్మ గెలుపు
వంశీ చందర్ పై 3,100 ఓట్ల తేడాతో విక్టరీ
పాలమూరు జిల్లా – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తన స్వంత జిల్లా పాలమూరులో గద్వాలకు చెందిన జేజేమ్మ డీకే అరుణా భరత సింహా రెడ్డి విజయం సాధించింది. రాహుల్ గాంధీ అనుచరుడిగా పేరు పొందిన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చందర్ రెడ్డిని ఏరికోరి మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఇదిలా ఉండగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైన ఓట్లు వంశీ చందర్ రెడ్డి ఓడి పోయేందుకు దోహద పడ్డాయి. రాష్ట్ర సర్కార్ ఉద్యోగుల పట్ల అనుసరించిన విధానం, పీఆర్సీ అమలు చేయక పోవడం ప్రభావం చూపించిందని చెప్పక తప్పదు. డీకే అరుణా రెడ్డికి పోస్టల్ బ్యాలెట్ల ద్వారా 2000 ఓట్లు రాగా షాద్ నగర్ నియోజకవర్గం ఆమెకు 1100 ఓట్లు వచ్చాయి. దీంతో 3,100 ఓట్ల తేడాతో విక్టరీ సాధించింది.
విచిత్రం ఏమిటంటే సీఎం రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గానికి వెళ్లలేదు. కానీ కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేశారు. ఆయన తొమ్మిదిసార్లు ప్రచార సభలకు వచ్చారు. అయినా తన అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డిని గెలిపించుకోలేక పోయారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఎమ్మెల్సీ గా బరిలో నిలిచిన మన్నె జీవన్ రెడ్డి కూడా ఓడి పోయారు.