NEWSNATIONAL

క‌ర్ణాట‌క‌పై కేంద్రం శీత‌క‌న్ను

Share it with your family & friends

నిప్పులు చెరిగిన డీకే శివ‌కుమార్

న్యూఢిల్లీ – క‌ర్ణాట‌క రాష్ట్రంపై కేంద్రం క‌క్ష సాధింపు ధోరణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న న్యూ ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద జ‌రిగిన స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు. ఇది ప్ర‌జాస్వామ్య స్పూర్తికి పూర్తిగా విరుద్ద‌మ‌న్నారు. దేశానికి అత్య‌ధిక ఆదాయం అందిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది క‌ర్ణాట‌క మాత్ర‌మేన‌ని గుర్తు పెట్టుకోవాల‌న్నారు.

మిగ‌తా రాష్ట్రాల కంటే త‌మ ప్రాంతం భిన్న‌మైద‌ని అన్నారు డీకే శివ‌కుమార్. కొన్నేళ్ల‌వుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు రావాల్సిన వాటా, నిధుల‌ను ఎందుకు విడుద‌ల చేయ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు. రాబోయే రోజుల్లో ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డం ఖాయ‌మ‌న్నారు.

వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం వ్య‌క్తం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. తాము ఇచ్చిన ఐదు గ్యారెంటీల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు డీకే శివ‌కుమార్.

మొద‌ట్లో కొంత ఇబ్బందిగా ఉండేద‌ని ప్ర‌స్తుతం పాల‌న గాడిలో ప‌డింద‌న్నారు. గ‌త బీజేపీ ప్ర‌భుత్వం త‌మ‌కు ఖాళీ ఖ‌జానా చూపించి వెళ్లి పోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఏది ఏమైనా కేంద్రం త‌న వైఖ‌రి మార్చుకుని రాష్ట్రాల ప‌ట్ల సానుకూలంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు డిప్యూటీ సీఎం.