నేత్రాణి ద్వీపంలో డీకే దంపతులు
మురుడేశ్వర్ బీచ్ లో హల్ చల్
కర్ణాటక – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు సతీమణి ఉష మురుడేశ్వర్ బీచ్ ను సందర్శించారు. ఇదే సమయంలో పేరు పొందిన మురుడేశ్వర్ సమీపంలోని నేత్రాణి ద్వీపాన్ని సందర్శించడమే కాదు ప్రకృతి అందాలను ఆస్వాదించారు. పాలిటిక్స్ పరంగా, ప్రభుత్వ పాలనా పరంగా బిజీగా ఉండే డీకే దంపతులు పర్యటించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇదిలా ఉండగా ప్రకృతికి దగ్గరగా ఉన్న ఈ దీవిని పావురాల ద్వీపం అని కూడా అంటారు. కర్నాటకలోని ఉత్తమ స్కూబా డైవింగ్ స్పాట్‌లలో ఒకటైన నేత్రాణి ద్వీపం పావురాలకు కూడా స్వర్గధామం. ఈ ప్రశాంతమైన ద్వీపం మనసుకు ఆహ్లాదకరమైన అనుభవంగా నిలుస్తుందనడంలో సందేహం లేదన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.
శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన ఫోటోలను పంచుకున్నారు. ఇవి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రతి ఏటా మురుడేశ్వర్ బీచ్ (సముద్రం) ను సందర్శించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం. ఇదే సమయంలో సముద్రాన్ని చూడడం, సందర్శించడం వల్ల శరీరం కొంత అలసట నుంచి ఉపశమనం కలుగుతందని పేర్కొన్నారు.
ఇదే సమయంలో అలసట నుంచి దూరం చేస్తుందని, అంతే కాకుండా నీరసం నుంచి చైతన్యవంతం చేసేలా ఈ బీచ్ ఎల్లప్పుడూ చేస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు డీకే శివకుమార్. ఇవాళ మురుడేశ్వర్ బీచ్ ను సందర్శించడం జీవితంలో మరిచి పోలేనని పేర్కొన్నారు.