అభినందించిన డీకే శివకుమార్
కర్ణాటక – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటకకు చెందిన ప్రముఖ సామాజిక సేవకురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తిని రాజ్య సభకు నామినేట్ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఈ సందర్బంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు సుధా మూర్తిని.
ఆమె ఇంజనీరింగ్ లో పట్టభద్రురాలు. అంతే కాదు తన ఫౌండేషన్ ద్వారా వేలాది మందికి సేవలు అందించారు. కష్ట కాలంలో ఆదుకునే ప్రయత్నం చేశారు. ప్రతి వారంలో ఒక రోజు తనే స్వయంగా కూరగాయలు కూడా అమ్ముతారు. ఎన్నో పుస్తకాలను కూడా రాశారు.
భారతీయ సంస్కృతి, నాగరికత పట్ల ఆమెకు అపారమైన గౌరవం కూడా. ఇదిలా ఉండగా రాజ్యసభకు నామినేట్ అయినందుకు గాను సుధా మూర్తిని ప్రత్యేకంగా అభినందించారు కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఆమెకు రాజ్యసభ సీటు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ పదవి దక్కడం అంటే కర్ణాటక ప్రజలందరికీ దక్కినట్లేనని పేర్కొన్నారు డీకే శివకుమార్.