NEWSNATIONAL

అరుదైన నాయ‌కుడు రాహుల్

Share it with your family & friends

కితాబు ఇచ్చిన డీకే శివ‌కుమార్

క‌ర్ణాట‌క – రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో అరుదైన నాయ‌కుడు రాహుల్ గాంధీ అంటూ కితాబు ఇచ్చారు. డిప్యూటీ సీఎం ట్విట్ట‌ర్ వేదిక‌గా బుధ‌వారం స్పందించారు.

లోక్ స‌భ‌లో ఎంపీగా, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఎన్నిక‌య్యారు రాహుల్ గాంధీ. ఆయ‌న తాజాగా దేశ వ్యాప్తంగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రెండు చోట్ల నుండి పోటీ చేశారు ఎంపీగా. కేర‌ళ లోని వాయ‌నాడు, ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని రాయ్ బ‌రేలిలో బంప‌ర్ మెజారిటీ సాధించింది అంద‌రినీ విస్తు పోయేలా చేశారు.

కాగా స‌భ‌లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున రాహుల్ గాంధీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఎన్నిక‌య్యారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలియ చేశారు డీకే శివ‌కుమార్. మీ ప‌ట్టుద‌ల‌, అంకిత భావం, భార‌త రాజ్యాంగం ప‌ట్ల అభిమానం, గౌర‌వం కోట్లాది మంది ప్ర‌జ‌ల‌తో పాటు త‌న‌ను కూడా ప్ర‌భావితం చేశాయ‌ని స్ప‌ష్టం చేశారు .

ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌ను కాపాడ‌డంలో టార్చ్ బేరర్ ఉంటార‌ని సందేహం లేద‌ని పేర్కొన్నారు డీకే శివ‌కుమార్.