హస్తం లక్ష్యం అభివృద్ది మంత్రం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం డీకేఎస్
కర్ణాటక – కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ఈసారి ఎన్నికల్లో సత్తా చాటడం ఖాయమని జోష్యం చెప్పారు కేపీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. గురువారం బెంగళూరు రూరల్ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా తన సోదరుడు డీకే సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామనగరలో భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎం సిద్దరామయ్యతో పాటు మంత్రులు, సీనియర్ నాయకులు , కేంద్ర పరిశీలకులు హాజరయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీల ద్వారా కర్ణాటకలో కొత్త మార్పు తీసుకు వచ్చిందని చెప్పారు డీకే శివకుమార్.
బెంగళూరులోని గ్రామీణ ప్రాంతాలతో పాటు రామనగర అభివృద్దికి తాము అనేక సంక్షేమ కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని తెలిపారు. దశల వారీగా వాటిని అమలు చేస్తూ వస్తున్నామని స్పష్టం చేశారు డీకే శివకుమార్.
తమ పార్టీ నినాదం సకల వర్గాల సంక్షేమమని పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా ఇవాళ అభివృద్ది పథంలో రాష్ట్రం ముందుకు వెళుతోందని తెలిపారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మరోసారి షాక్ ఇవ్వక తప్పదన్నారు. జనం తమకు ఓటు వేసేందుకు సిద్దమై ఉన్నారని చెప్పారు డీకే శివకుమార్.