కుమార స్వామిపై డీకే కన్నెర్ర
ప్రజ్వల్ రేవణ్ణతో సంబంధం లేదు
కర్ణాటక – చిల్లర రాజకీయాలు చేయడం మానుకుంటే మంచిదని సీరియస్ కామెంట్స్ చేశారు కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు వ్యతిరేకంగా జేడీఎస్, బీజేపీ సంయుక్తంగా ఆందోళన చేపట్టారు. డీకేఎస్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ, తండ్రి ఎమ్మెల్యే రేవణ్ణలపై లైంగిక ఆరోపణలు నేపథ్యంలో కేసు నమోదైంది.
రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే రంగంలోకి దిగింది. విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రేవణ్ణను అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో ఎంపీ గా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ కనిపించకుండా పోయాడు. ఆయనను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పించిందని ఆరోపణలున్నాయి.
ఈ సందర్బంగా తండ్రీ కొడుకులకు సంబంధించిన వీడియోల స్కామ్ తన పైకి నెట్టి వేసేందుకు మాజీ సీఎం కుమార స్వామి ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు డీకే శివకుమార్. తాను ఎంత బలంగా ఎదిగితే విమర్శలు, ఆరోపణలు అంతగా పెరుగుతాయని పేర్కొన్నారు. ఐ డోంట్ కేర్ అంటూ కామెంట్ చేశారు .