కన్నడ సర్కార్ పై మోడీ శీత కన్ను
నిప్పులు చెరిగిన డీకే శివకుమార్
కర్ణాటక – దేశంలో కొలువు తీరిన మోడీ బీజేపీ సంకీర్ణ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ . శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలని మోడీ కలలు కంటున్నాడని, ఆయనకు అంత సీన్ లేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భంగపాటు తప్పదన్నారు డీకే శివకుమార్.
తమ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కర్ణాటక రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, దీనిని తట్టుకోలేక పోతోంది బీజేపీ సర్కార్ అంటూ ఎద్దేవా చేశారు డిప్యూటీ సీఎం. కొత్తగా వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని కానీ దీని గురించి పట్టించు కోక పోవడం , నిరాదారమైన ఆరోపణలు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆరోపించారు డీకే శివకుమార్.
బీజేపీ నేతృత్వంలోని బస్వరాజ్ బొమ్మై సారథ్యంలోని ప్రభుత్వం పెట్టుబడులు రాకుండా వేధింపులకు గురి చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కర్ణాటక రాష్ట్రం అన్ని రంగాలలో పురోభివృద్దితో ముందుకు సాగుతోందని చెప్పారు. ఇకనైనా మోడీ ఆయన పరివారం వెనక్కి తగ్గితే మంచిదని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో వారికి నిరాశ తప్పదన్నారు డీకేఎస్.