DEVOTIONAL

అమ్మ వారి స‌న్నిధిలో డీకే

Share it with your family & friends

ప్ర‌జ‌లంతా బాగుండాల‌ని కోరా

క‌ర్ణాట‌క – పార్ల‌మెంట్ (సార్వ‌త్రిక) ఎన్నిక‌ల స‌మ‌యంలో నేత‌లు ప్రార్థ‌నా మందిరాల‌ను సంద‌ర్శించ‌డం ప‌రిపాటిగా మారింది. ప్ర‌ధానంగా గ‌త ఎన్నిక‌ల్లో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించి కాంగ్రెస్ పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు రావ‌డంలో కీల‌కంగా మారారు క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూనే ట్ర‌బుల్ షూట‌ర్ గా మారారు.

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ స‌త్తా చాటాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు డీకే శివ‌కుమార్. ఆయ‌న ఈ సంద‌ర్బంగా మ‌ఠాల‌ను , శైవ క్షేత్రాల‌తో పాటు ప‌నిలో ప‌నిగా పేరు పొందిన‌, కోరిన కోర్కెలు తీర్చే ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తున్నారు.

గురువారం డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ కుటుంబ సమేతంగా రామనగరలోని ప్రసిద్ధ చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఈ సంద‌ర్బంగా అమ్మ వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. శక్తి దేవత అయిన చాముండేశ్వరి దేశ ప్రజలందరికీ మేలు చేకూర్చాలని ప్రార్థించానని చెప్పారు. ఈసారి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ హ‌వా కొన‌సాగుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.