NEWSNATIONAL

ఈవీఎంల‌ను బ్యాన్ చేయాలి

Share it with your family & friends

క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకేఎస్

క‌ర్ణాట‌క – రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది ఈవీఎంల వ్య‌వ‌హారం. గ‌త ప‌దేళ్లుగా భార‌తీయ జ‌న‌తా పార్టీ న‌రేంద్ర మోడీ నేతృత్వంలో ఎలా వీటిని ట్యాంప‌రింగ్ కు పాల్ప‌డుతూ వ‌స్తోందోన‌న్న విష‌యంపై విచార‌ణ జ‌రిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఇప్ప‌టికే ముంబైలో చోటు చేసుకున్న ఈవీఎం ఘ‌ట‌న ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రినీ ఆలోచించేలా చేసింద‌న్నారు. తమ నాయ‌కుడు రాహుల్ గాంధీ ప‌దే ప‌దే ఈవీఎంల గురించి చెబుతూ వ‌స్తున్నా ప‌ట్టించు కోలేద‌న్నారు. కానీ ఇవాళ వాస్త‌వాలు వెలుగు చూస్తున్నాయ‌ని తెలిపారు డీకే శివ‌కుమార్.

ఇదే స‌మ‌యంలో ప్ర‌పంచంలోనే మోస్ట్ పాపుల‌ర్ బిలియ‌నీర్ గా పేరు పొందిన టెస్లా చైర్మ‌న్ , ట్విట్ట‌ర్ సిఇఓ , స్టార్ లింగ్ ఫౌండ‌ర్ ఎలోన్ మ‌స్క్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈవీఎంలు అంత సురక్షితం కావ‌ని, వాటిని ప‌ని చేయ‌కుండా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ తో నిలిపి వేయ‌వ‌చ్చ‌ని బాంబు పేల్చారు. దీనిపై తాజాగా స్పందించారు డీకే శివ‌కుమార్.