హిందీ భాష రుద్దితే ఊరుకునే ప్రసక్తి లేదు
తమిళనాడు – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ. తమ వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారని ఆరోపించింది. ఇతర భాషలు నేర్చుకునేందుకు తాము వ్యతిరేకం కాదన్నారు. ఏనాడూ వ్యతిరేకమని ఏనాడూ అనలేదని స్పష్టం చేసింది. ప్రతి ప్రాంతానికి ఒక భాష అనేది ఉంటుందని తెలిపింది. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నం చేస్తోందని , అందుకే అడ్డుకుని తీరుతామని వార్నింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపింది.
ఇవేవీ తెలుసుకోకుండా ఎలా పడితే అలా పవన్ కళ్యాణ్ మాట్లాడటం సబబు కాదని హితవు పలికింది డీఎంకే. తాము ప్రజల కోసం పని చేస్తున్న పార్టీ అని వెల్లడించింది. కానీ పవన్ కళ్యాణ్ తానేదో దేశోద్దారకుడైనట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని పేర్కొంది. ఏ ప్రాంతమైనా, ప్రజలపైనా కావాలని హిందీని రుద్దాలని చూస్తే ఎవరూ ఊరుకోరని హెచ్చరించింది డీఎంకే. తాము చూస్తూ ఊరుకోమని స్పష్టం చేసింది. మీకు ఇష్టమైతే మీ రాష్ట్రంలో అమలు చేసుకోవచ్చని, దానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. హిందీ పేరుతో తమ ఆత్మ గౌరవానికి భంగం కలిగించేలా చర్యలు తీసుకుంటామంటే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చింది డీఎంకే.