రాబర్ట్ ఎఫ్ కెన్నడీకి బిగ్ పోస్ట్
ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా – దేశంలో నూతన ప్రభుత్వం ఏర్పడడంతో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ట్రంప్ ప్రెసిడెంట్ గా ఇంకా పదవీ బాధ్యతలు చేపట్టలేదు. కానీ ముఖ్యమైన పదవులకు తన వారిని ఎంపిక చేసే పనిలో పడ్డారు .
ఇందులో భాగంగా పాలనా పరంగా యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (HHS)గా రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్‌ని నియమిస్తున్నట్లు ప్రకటించారు ప్రెసిడెంట్. ప్రజారోగ్యం విషయానికి వస్తే మోసం, తప్పుడు సమాచారం, తప్పుడు సమాచారంలో నిమగ్నమై ఉన్న పారిశ్రామిక ఆహార సముదాయం , డ్రగ్ కంపెనీల ద్వారా అమెరికన్లు చాలా కాలంగా నలిగి పోయారని ఆవేదన చెందారు ట్రంప్.
అమెరికన్లందరి భద్రత , ఆరోగ్యం ఏ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి అత్యంత ముఖ్యమైన పాత్ర. ప్రతి ఒక్కరూ హానికరమైన రసాయనాలు, కాలుష్యాలు, పురుగు మందులు, ఔషధ ఉత్పత్తులు , ఆహార సంకలనాల నుండి రక్షించబడటంలో సహాయపడటంలో హెచ్ హెచ్ ఎస్ పెద్ద పాత్ర పోషిస్తుంది.
ఈ దేశంలో విపరీతమైన ఆరోగ్య సంక్షోభం. కెన్నెడీ ఈ ఏజెన్సీలను గోల్డ్ స్టాండర్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ సంప్రదాయాలను పునరుద్ధరిస్తారు . పారదర్శకత యొక్క బీకాన్స్, క్రానిక్ డిసీజ్ మహమ్మారిని అంతం చేయడానికి , అమెరికాను మళ్లీ గొప్పగా , ఆరోగ్యంగా మార్చడానికి రాబర్ట్ కెన్నడీ కృషి చేస్తారని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్.