డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికా – అమెరికన్లకు తీపి కబురు చెప్పారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు ఇక ఆదాయ పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎలాంటి పన్ను లేకుండా చేస్తామని తెలిపారు. అమెరికన్లను మరింత ధనవంతులుగా చేస్తామని, అందుకు సంబంధించి కొత్త వ్యవస్థను తయారు చేస్తామని అన్నారు . ఇక ఇన్ కమ్ ట్యాక్స్ ఎత్తి వేస్తే వచ్చే నష్టాన్ని ఇతర దేశాలపై పన్నులు వేసి లోటను పూడ్చాలని యోచిస్తున్నారు ట్రంప్.
ఇదిలా ఉండగా జనవరి 20న నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత బైడెన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన పాలసీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికన్ ఫస్ట్ ఆ తర్వాతే ఎవరైనా అనే నినాదంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్.
తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారు ఎవరూ ఉండడాని వీలు లేదని హెచ్చరించారు. ఈ మేరకు పెద్ద ఎత్తున దాడులు చేయాలని పిలుపునిచ్చారు. ఈసారి ఎక్కువ ప్రభావం భారతీయులు, చైనీయులపై పడింది. ఓ వైపు భారత్ తో స్నేహం చేస్తానంటూనే మరో వైపు ఇబ్బంది పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు ట్రంప్.