NEWSINTERNATIONAL

అమెరికాను సూప‌ర్ ప‌వ‌ర్ గా చేస్తా

Share it with your family & friends

మాజీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ కామెంట్

అమెరికా – త‌న‌ను గ‌నుక ఈసారి అమెరికా అధ్య‌క్షుడినిగా ఎన్నుకుంటే ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ గా మారుస్తానంటూ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. ప్ర‌ధానంగా ఇత‌ర దేశ‌స్తులు ఎక్కువ‌గా అమెరికాను ఆక్ర‌మించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను వ‌స్తే ఇప్పుడు ఉన్న మార్కెట్ మ‌రింత ప‌రుగులు తీస్తుంద‌ని, ఇవాళ అన్ని రంగాలు నిర్వీర్య‌మై పోయాయ‌ని ఆవేద‌న చెందారు.

అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ , ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారీస్ వ‌ల్ల అమెరికా దేశానికి న‌ష్ట‌మే త‌ప్పా ఒరిగింది ఏమీ లేద‌న్నారు. క్రిష్టియ‌న్లు ప్ర‌తి ఒక్క‌రు ఇళ్ల‌లోంచి బ‌య‌ట‌కు రావాల‌ని పిలుపునిచ్చారు. యునైటెడ్ స్టేట్స్ అంతటా నివసిస్తున్న కాప్టిక్ క్రిస్టియన్ కమ్యూనిటీకి, భగవంతునిపై మీ దృఢమైన విశ్వాసాన్ని, శతాబ్దాలపాటు శ్రమించిన పట్టుదలను , ఈ గొప్ప దేశం పట్ల ప్రేమను నేను గాఢంగా అభినందిస్తున్నాను అన్నారు డొనాల్డ్ ట్రంప్ .

మా భాగస్వామ్య సామాజిక, కుటుంబ విలువలను నిల బెట్టడంలో సహాయ పడటానికి , అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడంలో సహాయ పడటానికి మీ మద్దతు ప్ర‌క‌టించాల‌ని, త‌మ విలువైన ఓటు వేయాల‌ని పిలుపునిచ్చారు.