క్రైస్తవులు బయటకు రండి..ఓటేయండి
పిలుపునిచ్చిన ప్రెసిడెంట్ అభ్యర్థి ట్రంప్
అమెరికా – అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన మాజీ దేశ అధ్యక్షుడు , రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో మతం తీవ్రమైన ముప్పులో ఉందన్నారు. అందుకే ఈసారి జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైనవని, దానిని గుర్తించి ప్రతి ఒక్కరు ఓటు వేసేందుకు ముందుకు రావాలని అన్నారు. లేక పోతే అమెరికాలో మనందరి పరిస్థితి దారుణంగా తయారవుతుందని హెచ్చరించారు.
ఇందులో భాగంగా అమెరికాలో ఉంటున్న క్రైస్తవ సోదరీ సోదరీమణులంతా గంప గుత్తగా ఇళ్లల్లోంచి బయటకు రావాలని, వెంటనే తమ విలువైన ఓటు హక్కు వినియోగించు కోవాలని కోరారు. మీ ప్రత్యేకమైన ఓటును తనకు వేయాలని, గెలిపిస్తే మీ అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. లేక పోతే ఇక బతకడం గగనంగా మారుతుందన్నారు డొనాల్డ్ ట్రంప్.
అమెరికాలో ప్రస్తుతం కొనసాగుతున్న పాలన పూర్తిగా అదుపు తప్పిందన్నారు. జో బైడెన్ నిద్ర పోతున్నారని, కమలా హారీస్ మాటలు తప్పా ఏ పనీ చేయడం చేత కావడం లేదంటూ ఎద్దేవా చేశారు ట్రంప్.