NEWSINTERNATIONAL

ఎన్‌ఐహెచ్ డైరెక్ట‌ర్ గా జే భ‌ట్టాచార్య‌

Share it with your family & friends

ఎంపిక చేసిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా – యుఎస్ నూత‌న దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల‌నా ప‌రంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే ప‌నిలో ప‌డ్డారు. ప్ర‌ధానంగా భార‌త దేశానికి చెందిన ప్ర‌వాస భార‌తీయులకు ఎక్కువ ప‌ద‌వులు ద‌క్కుతుండ‌డం విశేషం. ట్రంప్ కు కీల‌క‌మైన వ్య‌క్తిగా కాష్ ప‌టేల్ ను ఎంపిక చేశారు. తాజాగా మ‌రో వ్య‌క్తికి ప్ర‌యారిటీ ఇచ్చారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) డైరెక్టర్‌గా డాక్టర్ జే భట్టాచార్యను ట్రంప్ ఎంపిక చేశారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో వైద్య విధానాలకు వ్యతిరేకంగా చాలా బహిరంగంగా మాట్లాడారు. 2022 చివరిలో ది హెరిటేజ్ ఫౌండేషన్‌లో కోవిడ్-19 మహమ్మారిపై హౌస్ ఫ్రీడమ్ కాకస్ సభ్యులతో రౌండ్ టేబుల్ చర్చ సందర్భంగా డాక్టర్ జే భట్టాచార్య మాట్లాడారు.

ప్ర‌స్తుతం భ‌ట్టాచార్య స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఆరోగ్య పరిశోధకుడిగా ప‌ని చేస్తున్నారు. జె భట్టాచార్య ఆరోగ్య ఆర్థికవేత్త. ఆయ‌నను నియ‌మించినా త‌న‌ను సెనేట్ నామినేట్ చేయాల్సి ఉంటుంది. త‌ను 18,000 కంటే ఎక్కువ మంది కార్మికులను నియమించే ఏజెన్సీకి బాధ్యత వహిస్తాడు . 2,500 కంటే ఎక్కువ వైద్య పాఠశాలల్లోని 300,000 కంటే ఎక్కువ పరిశోధకులకు, దాదాపు 50,000 గ్రాంట్ల ద్వారా శాస్త్రీయ పరిశోధనలో దాదాపు $48 బిలియన్లకు నిధులు సమకూరుస్తారు.