NEWSINTERNATIONAL

ఎఫ్‌బీఐ బాస్ గా కశ్యప్‌ పటేల్‌

Share it with your family & friends

అధ్య‌క్షుడికి న‌మ్మ‌క‌మైన ఆఫీస‌ర్

అమెరికా – అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌వాస భార‌తీయుడు క‌ష్య‌ప్ ప‌టేల్ ను నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వ‌చ్చే నెల‌లో కొలువు తీర‌నున్నారు ట్రంప్. ఇప్ప‌టి నుంచే త‌న టీంను ఏర్పాటు చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. అమెరికాకు గుండె కాయ లాంటిది ఎఫ్బీఐ. పూర్తిగా సెక్యూరిటీకి సంబంధించింది. ట్రంప్ కు అత్యంత న‌మ్మ‌క‌మైన వ్య‌క్తిగా ఉన్నారు క‌ష్య‌ప్ ప‌టేల్.

తాజాగా జ‌రిగిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఆయ‌న‌పై జ‌రిగిన దాడి నుంచి ర‌క్షించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు క‌ష్య‌ప్ ప‌టేల్. క‌శ్య‌ప్ ప‌టేల్ క‌రుడుగ‌ట్టిన హిందూ వాది. త‌న‌కు భార‌త దేశం అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం.

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ష్య‌ప్ ప‌టేల్ గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. త‌ను మామూలోడు కాదు. ప్ర‌ధానంగా తీవ్ర‌వాదుల‌లో వ‌ణుకు మొద‌లైంది. వాళ్లు ఎక్క‌డ దాగున్నా ప‌ట్టుకోవ‌డంలో క‌శ్య‌ప్ ప‌టేల్ ది అందె వేసిన చేయి.

దేశంలోనే అత్యంత ముఖ్య‌మైన ద‌ర్యాప్తు సంస్థ‌గా పేరు పొందింది ఫెడ‌ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (ఎఫ్‌బీఐ) . దీనికి బాస్ గా ఉండ‌డం అంటే మామూలు విష‌యం కాదు.