విదేశీ కార్లపై 25 శాతం సుంకం
అమెరికా – అమెరికా దేశ అధ్యక్షుడిగా కొలువు తీరాక డొనాల్డ్ ట్రంప్ రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ దేశ ప్రజలతో పాటు అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులు, ఇతర విదేశీయులకు కోలుకోలేని రీతిలో షాక్ ఇస్తూ వస్తున్నారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పటికే గ్రీన్ కార్డ్స్, హెచ్1బి , తదితర వీసాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా మరో షాకింగ్ నిర్ణయం ఆశనిపాతంలా మారి పోయింది. విదేశీ కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. కార్లతో పాటు లైట్ ట్రక్ లకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచే కొత్త సుంకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. విదేశీ కంపెనీలు తమ దేశంలో ప్లాంట్లు పెట్టాలని కోరారు. ఇదే సమయంలో మరో కీలక ప్రకటన చేశారు. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం సుంకాలను ప్రకటించడానికి ట్రంప్ పరస్పర సుంకాలను ప్లాన్ చేస్తున్నారు. ట్రంప్ సుంకాలు అమెరికా వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేస్తాయి, మినహాయింపులు అస్పష్టంగా ఉన్నాయనే అభిప్రాయం అంతటా వ్యక్తం అవుతోంది. న్యూ ఓర్లీన్స్‌లోని ఎన్ ఎఫ్ ఎల్ సూపర్ బౌల్‌కు వెళ్లే మార్గంలో ఎయిర్ ఫోర్స్ వన్‌లో మీడియాతో మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్.