హిందువులు..క్రైస్తవులపై దాడులు దారుణం
ఖండించిన యుఎస్ మాజీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్
అమెరికా – అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. హిందువులు, క్రైస్తవులు , ఇతర మైనారిటీలపై అనాగరిక హింసను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. వారు బంగ్లాదేశ్‌లో గుంపులు దాడి చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు ట్రంప్. ఇది మొత్తం గందరగోళ స్థితిలో ఉందన్నారు.
ఇలాంటి ఘటనలు తాను అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఎప్పుడూ జరగలేదన్నారు. కమలా మారీస్, జోసెఫ్ బైడెన్ పూర్తిగా హిందువులను విస్మరించారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ దాడులు ఇజ్రాయెల్ నుండి ఉక్రెయిన్ , దక్షిణ సరిహద్దు దాకా విపత్తుగా మారాయని మండిపడ్డారు. తాము తిరిగి అధికారంలోకి వస్తామని, హిందువులు, క్రైస్తవులకు రక్షణ కల్పించేందుకు కృషి చేస్తామని ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్.
రాడికల్ లెఫ్ట్మత వ్యతిరేక ఎజెండా నుండి హిందూ అమెరికన్లను కూడా తాము రక్షిస్తామని అన్నారు. నా పాలనలో తన మిత్రుడు నరేంద్ర మోడీతో గొప్ప భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నామని, ఇది తిరిగి కొనసాగుతుందన్నారు. చిన్న వ్యాపారులకు సంబంధించి పన్నులను తగ్గించానని చెప్పారు ట్రంప్.
అమెరికా దేశ చరిత్రలో గొప్ప ఆర్థిక వ్యవస్థను సృష్టించిన ఘనత తనదేనని పేర్కొన్నారు మాజీ చీఫ్.