డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక విజయం
ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్
అమెరికా – అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో అద్భుతమైన విజయాన్ని సాధించారు డొనాల్డ్ ట్రంప్. తనను నమ్మి ఓటు వేసిన వారికి, ఓటు వేయని వారికి కూడా తాను రుణపడి ఉన్నానని చెప్పారు. గెలుపు సాధించిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా తాను చెప్పలేని ఆనందంలో ఉన్నానని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
అధ్యక్ష ఫలితాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. మునుపెన్నడూ చూడని రాజకీయ విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ విజయం నాది కాదు..మీ అందరిదీ, అమెరికన్లదని అన్నారు. తాను ఇచ్చిన మాట ప్రకారం అన్నింటిని అమలు చేస్తానని ప్రకటించారు.
తను గెలుపొందేందుకు సహకరించిన, పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థ్యాంక్స్ తెలిపారు. గొప్ప ప్రేమను, అనుభూతిని ఈ ఎన్నికలు నిలిచేలా చేశాయన్నారు డొనాల్డ్ ట్రంప్. తాను ఈ దేశానికి 47వ అధ్యక్షుడిని రెండోసారి ఎన్నిక కావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అమెరికా మరింత ఉన్నతమైన స్థితిలో నిలిపేందుకు కృషి చేస్తానని ప్రకటించారు నూతన దేశ అధ్యక్షుడు.
తన భార్య, కూతురు , మనుమరాలి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు డొనాల్డ్ ట్రంప్.