చెత్త తొలగించే వాహనంలో ట్రంప్ ప్రయాణం
ట్రంప్ మద్దతుదారులంతా చెత్త అన్న బైడెన్
అమెరికా – అమెరికా దేశంలో అధ్యక్ష ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే ఇరువురి మధ్యనే హోరా హోరీ కొనసాగుతోంది. మొన్నటి దాకా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ ముందంజలో కొనసాగితే అనూహ్యంగా డొనాల్డ్ ట్రంప్ ముందుకు వచ్చారు.
ఇదే సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు ట్రంప్ , కమలా హారీస్. ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టంగా మారింది. ప్రచార పరంగా చూస్తే ఒకరిని మించి మరొకరు దూసుకు వెళుతున్నారు.
కాగా ప్రస్తుత అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ డొనాల్డ్ ట్రంప్ తో పాటు తన మద్దతుదారులను ఉద్దేశించి అంతా చెత్త బ్యాచ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో బైడెన్ కు షాక్ ఇస్తూ చెత్తను తొలగించే వాహనంలో ప్రయాణం చేశారు డొనాల్డ్ ట్రంప్.
మరో వైపు డొనాల్డ్ ట్రంప్ కు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు టెస్లా చైర్మన్ ఎలోన్ మస్క్. ఇంకో వైపు కమలా హారీస్ కు సపోర్ట్ ఇస్తున్నారు బరాక్ ఒబామా. ఎవరికి వారే గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోంది.