ఎలోన్ మస్క్ సపోర్ట్ మరిచి పోలేను
ప్రశంసలు కురిపించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా – అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అద్బుత విజయాన్ని సాధించారు డొనాల్డ్ ట్రంప్. ఆయన 47వ అధ్యక్షుడిగా కొలువు తీరనున్నారు. స్పష్టమైన, చరిత్రాత్మకమైన విజయం సాధించిన ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ప్రధానంగా టెస్లా చైర్మన్, స్పేస్ ఎక్స్, ఎక్స్ సీఈవో, ఎండీ ఎలోన్ మస్క్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయనను ఆకాశానికి ఎత్తేశాడు ట్రంప్. తను అద్భుతంగా పని చేశాడని, తను గెలవాలని విస్తృతంగా ప్రచారం చేశాడని చెప్పారు . ఆయన చేసిన సపోర్ట్ ను తాను మరిచి పోలేనని అన్నారు .
మస్క్ చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అద్భుతమైన వ్యక్తి అంటూ కొనియాడారు డొనాల్డ్ ట్రంప్. ప్రచార సమయంలో మస్క్ తో గడిపిన క్షణాలు గొప్పనైనవని పేర్కొన్నారు. ఎలోన్ మస్క్ ను నక్షత్రంతో పోల్చారు. నక్షత్రం వెలుతురును కలిగి ఉంటుందని అన్నారు. ఎలోన్ కూడా అలాంటి వారేనని పేర్కొన్నారు.
రెండు వారాలు ఫిలడెల్ఫియాలో, పెన్సిల్వేనియాలోని వివిధ ప్రాంతాలలో ప్రచారం చేశాడని చెప్పారు ట్రంప్. ఆయన మాత్రమే చేయగలడు. ఇదే సమయంలో ఆయన స్థానంలో ఎవరు ఉన్నా చేయలేక పోయి ఉండేవారని అన్నారు ట్రంప్.