కితాబు ఇచ్చిన అమెరికా చీఫ్
అమెరికా – అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకంటే మోదీ అత్యంత శక్తివంతమైన, కఠినతరమైన నాయకుడని ప్రశంసించారు. పీఎం యుఎస్ టూర్ లో భాగంగా సుంకాల ఒప్పందంపై ఇరువురు నేతలు చర్చించారు. మీ ఇద్దరిలో ఎవరు మంచి వారంటూ అడిగిన ప్రశ్నకు పై విధంగా ట్రంప్ సమాధానం ఇచ్చారు. ఇరు దేశాల మధ్య సత్ సంబంధాలు ఉన్నాయన్నారు. తనకు అత్యంత నమ్మకమైన స్నేహితుడు మోదీ అంటూ స్పష్టం చేశారు.
ద్వైపాక్షిక సమావేశంలో సుంకాల గురించి ప్రత్యేకంగా చర్చించారు. మా ఇద్దరి మధ్య గత కొన్నేళ్లుగా స్నేహం కొనసాగుతూనే ఉందన్నారు. మోదీ నాకంటే గొప్ప సంధాకర్త అంటూ పేర్కొన్నారు. అయితే తామిద్దరి మధ్య ఎలాంటి పోటీ లేదన్నారు. అయితే అక్రమ వలసదారుల సమస్య ఒక్క భారత్, అమెరికా దేశాల సమస్య మాత్రమే కాదన్నారు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించిన ప్రధాన సమస్య అని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుంకాలను సడలించడం, చమరు, గ్యాస్, యుద్ద విమానాలను కొనుగోలు చేయడం, వాణిజ్య యుద్దాన్ని నిరోధించే రాయితీల గురించి మాట్లాడేందుకు ముందుకు వచ్చారని చెప్పారు డొనాల్డ్ ట్రంప్. అయితే సుంకాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశం ఏమి వసూలు చేసినా మేము కూడా వాటిని వసూలు చేసి తీరుతామన్నారు.