NEWSINTERNATIONAL

హ‌త్యా ప్ర‌య‌త్నం ట్రంప్ క్షేమం

Share it with your family & friends

పొద‌ల్లో దొరికిన ఏకే 47 తుపాకి

అమెరికా – దేశ మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ్డారు. ఆయ‌న‌పై కాల్పులు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. గోల్ఫ్ కోర్స్ లో ఉన్న స‌మ‌యంలో ట్రంప్ పై హ‌త్యా ప్ర‌య‌త్నం జ‌రిగిన‌ట్లు టాక్.

ఇదిలా ఉండ‌గా సెక్యూరిటీ విచార‌ణ‌లో పొద‌ల చాటున ఏకే 47 తుపాకీ క‌నిపించ‌డంతో ఈ దాడికి మ‌రింత బ‌లం చేకూరింది. ప్ర‌స్తుతానికి ట్రంప్ క్షేమంగా ఉన్న‌ట్లు త‌న సెక్యూరిటీ టీమ్ వెల్ల‌డించింది. ఈ మేర‌కు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌చార ప్ర‌తినిధి స్టీవెఎన్ చియుంగ్ సోమ‌వారం దాడికి సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు.

అయితే తుపాకీ కాల్పుల శ‌బ్దం వినిపించిన స‌మ‌యంలో డొనాల్డ్ ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్నార‌ని తెలిపారు.
అయితే ఫ్లోరిడా లేని వెస్ట్ పామ్ బీచ్ లోని ట్రంప్ గోల్ఫ్ కోర్స్ లో కాల్పులు జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని, ఆయుధంతో పాటు దాడికి పాల్ప‌డిన వ్య‌క్తిని ప‌ట్టుకున్న‌ట్లు తెలిపారు. ఈ విష‌యాన్ని న్యూయార్క్ టైమ్స్ వెల్ల‌డించింది.

ట్రంప్ బ‌య‌లు దేరిన ప్ర‌దేశానికి అత్యంత స‌మీపంలోని పొదల్లో ఏకే 47 రైఫిల్ ను క‌నుగొన్న‌ట్లు మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌యుడు డొనాల్డ్ ట్రంప్ జూనియ‌ర్ వెల్ల‌డించారు. మొత్తంగా ఇది రెండో ఘ‌ట‌న కావ‌డం విశేషం.

ట్రంప్ పై జ‌రిగిన దాడి ప‌ట్ల తీవ్రంగా ఖండించారు ప్ర‌స్తుత దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్.