ఎలోన్ మస్క్ ఏనాడూ సాయం అడగలేదు
ప్రశంసలు కురిపించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా – అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సోమవారం క్యాంపెయిన్ లో పాల్గొని ప్రసంగించారు. అమెరికన్లకు తాను భరోసా ఇస్తున్నానని, ఈసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో తనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వస్తున్న ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలోన్ మస్క్ ను ఆకాశానికి ఎత్తేశారు. ప్రశంసల జల్లులు కురిపించారు.
తాను అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పలు మార్లు ఎలోన్ మస్క్ కలిశారని, కానీ ఏనాడూ చిన్నపాటి సాయం చేయమని తనను ఏనాడూ అడిగిన దాఖలాలు లేవన్నారు. ఈ సందర్బంగా ఎలోన్ మస్క్ ను చూస్తే తనకు ఆశ్చర్యం వేస్తుందన్నారు డొనాల్డ్ ట్రంప్.
ఇవాళ ప్రపంచాన్ని తన టెస్లా విద్యుత్ కార్లతో విస్తు పోయేలా చేశాడని, ఆటోమొబైల్ రంగంలో టాప్ లో కొనసాగుతోందని, ప్రపంచ కుబేరులలో తను కూడా ఒకడని, కానీ తన కోసం సంపూర్ణ మద్దతు ప్రకటించడం పట్ల సంతోషంగా ఉందన్నారు మాజీ చీఫ్.
ఒక రకంగా చెప్పాలంటే టెస్లా వరల్డ్ లోనే అతి పెద్ద కంపెనీ. ఈ కార్లకు బిగ్ డిమాండ్ ఉందన్నారు. మీరు విద్యుత్ పరికరాలను మరింత సులభతరం చేయగలరా అని ఎలోన్ మస్క్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఈ సందర్బంగా ఎలోన్ మస్క్ ను చూస్తే తనకు గర్వంగా ఉందన్నారు.