మోడీ నాయకత్వంలో భారత్ సురక్షితం – ట్రంప్
కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ అధ్యక్షుడు
అమెరికా – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీపై ప్రశంసల జల్లులు కురిపించారు అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మంగళవారం అమెరికా ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సమావేశంలో ప్రసంగించారు ట్రంప్. ఈ సందర్బంగా మోడీని ఆకాశానికి ఎత్తేశాడు.
మోడీ ప్రధానమంత్రిగా కొలువు తీరక ముందు భారత దేశం తీవ్రమైన ఇబ్బందుల్లో , అస్థిరంగా ఉండేదన్నారు. కానీ ఎప్పుడైతే 2014లో ఇండియాకు పీఎంగా వచ్చాడో ఆనాటి నుంచి నేటి దాకా ఆ దేశం అత్యంత బలమైన దేశాలలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు ట్రంప్.
ప్రస్తుతం మోడీ పటిష్టవంతమైన నాయకత్వంలో భారత్ అత్యంత బలంగా ఉందన్నారు మాజీ చీఫ్. ఒక రకంగా చెప్పాలంటే మోడీతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. స్నేహానికి విలువ ఇస్తాడు. అంతకు మించి కలుపు గోలుగా ఉంటాడని అన్నారు. ఇదే సమయంలో తనను కానీ లేదా తన భారత దేశాన్ని కానీ ఎవరైనా టచ్ చేయాలని చూసినా లేదా బెదిరించాలని చూస్తే మాత్రం ఊరుకోడంటూ , ఉగ్ర రూపం దాల్చుతాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్.
మోడీ పేరుతో నిర్వహించిన ఈవెంట్ కు ట్రంప్ హాజరై ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం కెనడా కయ్యానికి కాలు దువ్వుతోంది.